తెలంగాణ కరుణ పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దికొద్దిగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బిజీబిజీగా సీఎం కేసీఆర్ గడపడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఉన్న కొద్దీ ప్రభావం ఎక్కువ అవుతున్న తరుణంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి మొత్తం కరోనా వైరస్ హాస్పిటల్ గా మారటం జరిగింది. దీంతో అక్కడ వైద్య సదుపాయాన్ని పరిశీలించిన కేటీఆర్ రాష్ట్రంలో ప్రతి చోటా ఎక్కడ ఏం జరుగుతుందో మానిటరింగ్ చేస్తు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమీద పేదవాళ్ళు ఏమీ తినలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో కేటీఆర్ అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు.మేటర్ లోకి వెళ్తే లాక్ డౌన్ ఈ నేపథ్యంలో ప్రభుత్వ నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అయితే పరిస్థితి మొత్తం పర్యవేక్షించిన కేటీఆర్…పేదవాళ్ల కోసం ఒక ముందడుగు వేస్తూ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు లాక్ డౌన్ ప్రభావం కొనసాగినన్ని రోజులు 5 రూపాయల భోజనాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలో ఉన్న 150 అన్నపూర్ణ కేంద్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దీంతో ఈ నిర్ణయం వల్ల హాస్టల్ లో ఉండిపోయి అవస్థలు పడుతున్న విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేటీఆర్ నిర్ణయం పట్ల ఏపీ లో ఉన్న కొంతమంది నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా దుకాణాలు మరియు రైతు బజార్ల దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా రియల్ తీసుకోవాలని, అవసరమైతే సంచార రైతు బజార్ల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను కూరగాయలను అందించాలని నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో కేటీఆర్ చాలా వరకు రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో కేసిఆర్ కి కాస్త రెస్ట్ వచ్చినట్లయింది