టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న తన కస్టమర్లు ఎన్నో వేల పుస్తకాలను ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. తన ఇ-బుక్స్ ప్లాట్‌ఫాం అయిన Juggernaut Booksలో ఉన్న వేల పుస్తకాలను ఎయిర్‌టెల్ కస్టమర్లు ప్రస్తుతం ఉచితంగా చదువుకోవచ్చు. కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
కాగా ఎయిర్‌టెల్ 2017లో Juggernaut Booksను కొనుగోలు చేసింది. అందులో అనేక ఇ-బుక్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అనేక నవలలు, ఎడ్యుకేషన్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక Juggernaut Books యాప్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై పొందవచ్చు.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలోనే తమ కస్టమర్లకు ఇ-బుక్స్‌ను ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనాను అడ్డుకోవాలంటే ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలని అన్నారు.