ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

-

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సర్కారు పాఠశాలల విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఇస్తున్న విద్యాశాఖ వాటిని… స్కూల్ బ్యాగ్ లో ఉంచి పంపిణీ చేయాలని భావిస్తోంది. దానికి పథకం పేరు పెట్టి ఇవ్వొచ్చా ? అందుకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మరిన్ని నిధులను పొందే అవకాశం ఉందా ? అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది.

ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అయ్యే ఖర్చులో కేంద్రం వాటా 60 శాతం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందికి స్కూల్ బ్యాగులు ఇవ్వాలంటే ఏకంగా 40 కోట్లు ఖర్చు అవుతుంది. జత బూట్లు అలాగే రెండు జతల సాక్సులు కూడా ఇస్తే ఎంత అవుతుంది ? అనే దానిపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో చ‌ర్చించిన త‌ర్వాత దీనిపై క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news