బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైంది – KCR

-

అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఒక్క వందే భారత్ రైలుని ప్రధాని మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడి అయిందని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక మంత్రి వచ్చి తెలంగాణలో డీలర్ తో కొట్లాడిందని.. ఏం సాధించాడని మోడీ ఫోటోని పెట్టాలని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

ప్రధాని మోదీకి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారని, మేక్ ఇన్ ఇండియా జోకింగ్ ఇండియా గా మారిపోయిందని అన్నారు. దేశంలో మోడీ తెచ్చిన ఏ పాలసీ అయినా సక్సెస్ అయిందా? నోట్ల రద్దు సక్సెస్ అయిందా? ఇప్పుడు మనీ సర్క్యులేషన్ పెరిగిందని, కేంద్రం దగ్గర దేనికి లెక్కలు ఉండవని, ఎన్పీఏ ల పేరుతో లక్షల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news