ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పాలకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళను అనవసరంగా ఏ ఒక్క మాట అన్నా సరే ఇబ్బంది పడటం ఖాయం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న తేడా వచ్చినా సరే బుడగ పగలడం ఖాయం. కాని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్ర వారి విషయంలో అనుసరించే వైఖరి చూసి చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. రెవెన్యు ఉద్యోగులు అంటే కేసీఆర్ కి గిట్టదు.
వాళ్ళ వలన అవసర౦ ఉన్నా సరే వారిలో కొంత మంది చేసే అవినీతి కారణంగా వారిని విమర్శిస్తూ ఉంటారు కేసీఆర్. వారిని మీడియా ముందే విమర్శిస్తారు ఆయన. ఇక ఇప్పుడు కరోనా కారణంగా రాష్ట్రం ఆర్ధిక నష్టాల్లో ఉంది. రాష్ట్రం వాస్తవానికి ఇబ్బంది పడుతుంది. అందుకే కేసీఆర్ ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఏ నిర్ణయం అయినా సరే వేగంగా కచ్చితత్వం తో తీసుకోవడం కేసీఆర్ స్టైల్.
ఇప్పుడు ఆయన ఉద్యోగులకు జీతాలు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం చూసి దాదాపు జాతీయ మీడియా మీడియా కూడా షాక్ అయింది. అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఆశ్చర్యంగా చూసాయి. కరోనా వచ్చిన సమయంలో ఇప్పుడు ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే కేసీఆర్ మాత్రం రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో అందరూ భాగం పంచుకోవాలని చెప్తూ వెంటనే నిర్ణయం తీసుకుని సగటున 50 శాతానికి పైగా కోత విధించారు. ఈ నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా వరకు ధైర్యం కావాలి. కాని కేసీఆర్ మాత్రం అనుకున్న వెంటనే నిర్ణయం తీసుకుని షాక్ కి గురి చేసారు.