విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌సిబి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, 149 పరుగులకు పరిమితమైంది. తన జట్టు స్కోరు వేగం పెంచాలన్న ఉద్దేశంతో 12వ ఓవర్ ఒకటో బంతికి భారీ షాట్ ను ఆడిన కోహ్లీ, లాంగ్ లెగ్ లో ఉన్న విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆపై కోహ్లీ అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటనపై లెవల్ 1 అభియోగాలను నమోదు చేసిన రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టి, కోహ్లీని మందలించాడు. మ్యాచ్ తర్వాత, ఐపిఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు లెవెల్ 1 యొక్క లెవల్ 2.2 కింద క్రికెట్ పరికరాలు లేదా ఆన్-ఫీల్డ్ పరికరాలపై కోపం చూపించినందుకు రిఫరీ వెంగిలాల్ నారాయణ్ కుట్టి మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించారని తెలుస్తోంది. తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ జట్టు 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది.