తెలంగాణా సర్కార్ వలస కార్మికుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న కేసుల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ని పోడిగిస్తున్నాం అని చెప్పి లాక్ డౌన్ ని మే 7 వరకు కఠినం గా అమలు చేస్తామని చెప్పారు. ఇక ఇది పక్కన పెడితే ఆయన లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అని భావించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ నెలకు ఏ విధంగా అయితే నిధులు ప్రజలకు ఆర్ధికంగా ఆదుకోవడానికి గాను నెలకు 1500 ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలి అని ఆయన భావిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కాలంలో ఎవరూ కూడా పస్తులు ఉండకూడదు అని 12 కేజీల బియ్యం కూడా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇది పక్కన పెడితే కేసీఆర్ వలస కార్మికులకు కూడా నగదు అదే విధంగా ఇవ్వాలి అని నిర్ణయం వెల్లడించారు.
వలస కార్మికులు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. వారి అవసరం రాష్ట్రానికి ఉందని గ్రహించి వాళ్ళు ఎవరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకుని ఈ విధంగా వారికి ఆర్ధిక సహాయం చేస్తుంది సర్కార్. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇతఃర రాష్ట్రాలు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలా ఆలోచించలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.