దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెంచే అవకాశం…

-

తెలంగాణా సర్కార్ లాక్ డౌన్ ని కేంద్రంతో సంబంధం లేకుండా పెంచాలి అని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. ఎవరూ కూడా కరోనా బారిన పడకూడదు అని భావించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజలకు కాస్త కఠినం గానే ఆయన సూచనలు చేసారు. బయటకు వస్తే వదిలేది లేదని అన్నారు.

ఇక కేంద్రం కూడా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో మరోసారి నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. కరోనా కేసులు గనుక ఇంకా పెరుగుతున్నాయి అంటే మాత్రం లాక్ డౌన్ ని మరో రెండు వారాల పాటు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం 15 వేలు దాటాయి కరోనా వైరస్ కేసులు. దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది.

ఇప్పుడు లాక్ డౌన్ ని మళ్ళీ తగ్గిస్తే ఇబ్బందులు వస్తాయని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో చాలా అదుపులోనే ఉన్నా జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుకే లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ సర్కార్… తీసుకున్న నిర్ణయాన్నే దేశ వ్యాప్తంగా కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేబినేట్ సమావేశం తర్వాత కేంద్రం ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news