ఏపీ తెలంగాణ బస్సుల అంశం.. కేసీఆర్ చేతిలో !

-

చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద అనేక మార్లు రెండు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిగినా ఏమీ తేలడం లేదు. అయితే ఆ అంశం ఒకట్రెండు రోజుల్లో కొలిక్కిరావచ్చని అంటున్నారు. తెలంగాణ‌ – ఏపీ ఆర్టీసీల మధ్య టెలీకాన్ఫరెన్స్ చర్చలు సాగుతున్నాయి. లక్షా‌60 వేల కిలో మీటర్లకు రూట్ మ్యాప్ ను తెలంగాణా ఆర్టిసి అధికారులకు ఎపిఎస్ ఆర్టీసి అధికారులు పంపారు.

నిజానికి మొదట 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పుతామని ప్రతిపాదన పెట్టింది ఎపి ఎస్ ఆర్టిసి. అయితే ఏపీ ప్రతిపాదనను టీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరించకపోవడంతో లక్ష కిలోమీటర్లు తగ్గించిన ఎపీఎస్ ఆర్టీసీ, 1లక్షా 60 వేల కిలోమీటర్లకు మరో సారి రూట్ మ్యాప్ పంపింది. తెలంగాణ భూభాగంలో ఏపీ తిప్పనున్న రూట్ల ప్రతిపాదనలు, బస్సుల సంఖ్యతో కూడిన నివేదిక సీఎం కేసీఆర్ ఆఫీస్ కి చేరాయి. కేసీఆర్ ఏపీ ప్రతిపాదనలు ఆమోదిస్తే రెండు, మూడు రోజుల్లో ఎపి, తెలంగాణా‌ మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news