ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుతో పాటు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సెల్‌లో స్పష్టం చేశారు. దాని ద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తే ఊరుకోబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించబోమని ప్రకటించారు. తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు. ఇక కృష్ణా, గోదావరిపై ఏ ప్రాజెక్టు కట్టాలన్నా.. వాటికి అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ దేనని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ కూడా తన వాదనను గట్టిగా వినిపించినట్లు ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేయడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసినట్లు తెలిపాయి.