మొబైల్ ఫోన్లు మరియు టెక్సాలజీ పెరుగుతున్న కొద్ది.. సమాజంలో దారుణాలు కూడా పెరిగి పోతున్నాయి. మనిషులకు అస్సలు భద్రత ఉండటం లేదు. ముఖ్యంగా మహిళలు నగ్న ఫోటోలు మొబైళ్లలో తీసి… సోషల్ మీడియా లో పెడుతున్నారు. అయితే.. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని… హెచ్ అండ్ ఏం బట్టల దుకాణంలో దారుణం జరిగింది.
ఓ యువతి… బట్టలు మార్చు కుంటుండగా పక్క ట్రయిల్ రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్న ఫోటోలను చిత్ర కరించారు ఇద్దరు విద్యార్థులు. అయితే.. ఈ విషయాన్ని చాక చక్యంగా వ్యవహరించిన ఆ యువతి పసి గట్టి…ఆ ఇద్దరి గురించి సమాచారం ఇచ్చింది. ఆ స్టోర్ పై మరియు వారిద్దరిపై కేసు పెట్టింది యువతి. దీంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు….. ఇద్దరు విద్యార్థులతో పాటు. స్టోర్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఫోటోలు తీసిన సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.