సీఎం రేవంత్ కలల ప్రాజెక్టులో కోర్టులో కేసు వేసిన అల్లు అర్జున్ మామ

-

సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత(అల్లు అర్జున్ మామ) చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. రేవంత్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ, తన ఇంటిని కూల్చొద్దని, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో నాలుగు పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదని..ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. కాగా, జానారెడ్డి,ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version