కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కర్నూలులోని స్కూల్ లో చెట్టు కూలి విద్యార్థిని మృతి చెందింది. కర్నూలులోని సి.బెళగల్ మండలం పోలకల్ జడ్పి స్కూల్ లో చెట్టు కూలిన ఘటనలో విద్యార్థిని మృతి చెందింది. కర్నూలు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ శ్రీలేఖ(13) మృతి చెందింది. 8వ తరగతి చదువుతోంది శ్రీలేఖ. ఈ నెల 28వ తేదీ స్కూల్ లో సైన్స్ పీరియడ్ లో స్కూల్ ఆవరణలో మొక్కలు చూపిస్తుండగా విరిగిపడింది చెట్టు.
ఈ సంఘటన లో 8 మంది విద్యార్థులకు గాయాలు, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఇందులో తాజాగా చికిత్స పొందుతూ మృతి చెందింది శ్రీలేఖ. దీంతో కన్నీరు మున్నీరవుతున్నారు శ్రీలేఖ తల్లిదండ్రులు. అటు శ్రీ లేఖ మృతి సంఘటన పోల్ కల్ స్కూల్ లో విద్యార్థుల్లో విషాదం నింపింది.