మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ అడ్డు పడితే.. కేసీఆర్ కుక్క చావు చస్తావ్ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా ధర్మారెడ్డి పాలెంలో ఆయన మాట్లాడారు. బుల్డోజర్లు ఎక్కించి మరీ ప్రాజెక్ట్ చేపడుతాం. మూసీని అడ్డుకుంటే.. కుక్క చావు తప్పదన్నారు. రూ.2కోట్లతో శివయ్య దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నల్గొండలో మల్లసారి మొక్క కూడా మొలవదు. ఈ సారి మూడు అడుగులోడు తప్ప.. మొత్తం ఊడ్చకపోయిర్రు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ నీ బిడ్డ మూడు నెలలు జైలుకు వెళ్తేనే నీకు దు:ఖం వచ్చింది. మా బిడ్డలు కాలు వంకర, నడుము వంకరతో పుడితే వాళ్లను ఇంట్లో మంచానికి కట్టేసి తల్లులు పనులకు వెళ్తున్నారని.. వాళ్ల దుఖం నీకు పట్టట్లేదా..? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం చేసి తీరుతాం. 2025 నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు కదం తొక్కుతాం. మూసీ నది ప్రక్షాళన చేపడుతాం. బిల్లా, రంగలు రావాలి. వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుంకు రాయి కట్టి మూసీ నదిలో వదులుతారు. నడుస్తామన్న హరీశ్ రావు మీ సవాల్ ని స్వీకరిస్తున్నా. వాడపల్లిలో కలిసే వద్ద పాదయాత్ర మొదలవుతుంది. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందల ఉందన్నారు.