లక్ష ఉద్యోగాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొని మాట్లాడారు కేసీఆర్. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదని వ్యాఖ్యానించారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని.. ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్కడ ఇప్పటివరకు చూడలేదని కేసీఆర్ ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.

కందుకూరులో మెడికల్ కళాశాల వచ్చిందంటే.. సబితా ఇంద్రారెడ్డినే కారణం అన్నారు. పట్టబట్టి మెడికల్ కాలేజీ తెప్పించుకున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి రాబోతుంది. స్థానికంగా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. పారామెడికల్, నర్సింగ్ కాలేజీలు వస్తాయి. కందుకూరు మంచి హబ్ గా మారబోతుంది. మెట్రో రైలు కందుకూరు దాకా రావాలని కేబినెట్ మీటింగ్ లో పోరాటం చేశారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కొత్త పరిశ్రమలు వచ్చాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలోనే ఉంది. ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ వచ్చింది. లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చైనాలో ఉన్న పెద్ద కంపెనీ మూసుకొని ఇక్కడకు వస్తాం. కొంత జాగా ఇవ్వండి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news