కేదార్ నాథ్ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక ఆలయ తలుపులను టెంపుల్ నిర్వాహకులు మూసివేశారు. మరల 6 నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి.ఈ కాలంలో టెంపుల్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం కల్పించనున్నారు. శీతాకాలంలో చార్ధామ్ ఆలయాలు మూసివేసి ఉంటాయి.
శనివారం గంగోత్రి ధామ్‌ను మూసివేయగా..నేడు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. ఇక యమునోత్రి టెంపుల్ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేయనున్నారు. చివరగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది మే 10న చార్ధామ్ యాత్ర ప్రారంభమై చివరిదశకు చేరుకుంది.