ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్.. రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. దీంతో భారత లక్ష్యం 147 పరుగులు మాత్రమే. మరోసారి 5 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ ఒక్క వికెట్ కూడా తీయని అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. 174 పరుగులకే కివీస్ ఆలౌట్ చేయడంతో భారత్ విజయం తధ్యమని తెలుస్తోంది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 265 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 235 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఇవాళ ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కివీస్ తన చివరి వికెట్ ని కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో అజాజ్ పటేల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో కివిస్ 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ కి నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించడం టీమిండియాకు అంత సులభం ఏమి కాదు.. వాంఖడే లో ఇప్పటివరకు అత్యధిక రన్స్ చేసిన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. ఈ టార్గెట్ ను టీమిండియా ఛేదిస్తుందా..? లేక చతికిల పడుతుందా..? వేచి చూడాలి మరీ.