ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల గుంపు మరోసారి దాడి చేశాయి. గత కొన్నిరోజులుగా అటవీ ఏనుగులు దారి తప్పి ఊర్లలోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ ఊర్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా పొలాలు, తోటల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పంట పొలలాను నాశనం చేస్తున్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
దీనికితోడు పొలం పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలపై దాడులకు తెగబడుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. కారాడవలసలో కొబ్బరి తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి.దీంతో గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు.శనివారం సాయత్రం ఆటో, మిల్లర్‌ను గజరాజుల గుంపు తిప్పిపడేశాయి. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను బంధించేందుకు వాటిని ట్రాక్ చేస్తున్నారు.