Keerthy Suresh: మోడ్రన్ డ్రెస్సులో కీర్తిసురేశ్ ఫోజులు..స్పెయిన్ థ్రో బ్యాక్ పిక్చర్స్ షేర్

-

అందాల ముద్దుగుమ్మ, ‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో ఆమె స్టార్ హీరోలందరి సినిమాల్లో దాదాపుగా యాక్ట్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆమె కలిసి నటించిన ‘సర్కారు వారి పాట ’సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో చిరుకు చెల్లెలిగా నటిస్తోంది.

కీర్తి సురేశ్..సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సుందరి మోడ్రన్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు లవ్ యూ అంటున్నారు. ఈ మేరకు వారు లవ్ సింబల్స్ కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.

స్పెయిన్ లో దిగిన ఫొటోలు ఇవి అనే క్యాప్షన్ తో కీర్తి సురేశ్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో కీర్తి సురేశ్ తన ఫ్రెండ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. మోడ్రన్ వైట్ కలర్ డ్రెస్సులో గాగుల్స్ ధరించి చాలా స్టైలిష్ గా ఉంది కీర్తి సురేశ్. అలా కుర్చీలో కూర్చొని ఒక చేతిని తన మెడపైన పెట్టుకుని అటు వైపునకు చూస్తూ కైపెక్కిస్తోంది ఈ సుందరి.

https://www.instagram.com/p/CcaNrdCsH1D/

Read more RELATED
Recommended to you

Latest news