ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా దసరా సినిమా సందడే. రేపు ఈ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నాని, కీర్తి సురేశ్ లు ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. ఇక ఈ మూవీలో చమ్కీల అంగిలేసి పాట ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్.
ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్ మామూలుగా లేవు. తాజాగా ఈ సాంగ్ పై కీర్తి సురేశ్ తల్లి, అలనాటి తార మేనక సురేశ్ స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె ట్రెండ్‌కు అనుగుణంగానే దీనిని క్రియేట్ చేసినట్లు క్యాప్షన్ పెట్టారు. మరోవైపు, కీర్తి సోదరి భర్త సైతం ఈ పాటకు డ్యాన్స్ చేశాడు. మేనకతో కలిసి అతడు ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కీర్తి ఫుల్ ఖుష్ అయిపోతోంది.