ప్రస్తుతం తరంలో ఒత్తిళ్ళు పెరిగిపోతుండడంతో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. తీవ్రమైన పని ఒత్తిళ్ళు, గుండెమీద ప్రభావం చూపుతున్నాయి. దానివల్ల హార్ట్ ఫెయిల్ అవుతుంది. అసలు హార్ట్ ఫెయిల్ అవడం అంటే ఏమిటి అనే దగ్గర నుండి దాని లక్షణాలు, కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం.
హార్ట్ ఫెయిల్
శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె, ఆ పని మానేయడం. అప్పుడు ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడి శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడుతుంది.
ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది రోజు రోజుకీ ఎక్కువవుతూనే ఉంది. యుక్త వయసు వారు కూడా ఈ ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. హైబీపీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ మొదలగునవి గుండెని బలహీనంగా చేసి, ఫెయిల్ అయ్యే స్థితికి తీసుకువస్తాయి.
దీని లక్షణాలు
ఛాతిలో నొప్పి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మూర్ఛ పోవడం
అలసట
బలహీనత
అవయవాల్లో వాపు రావడం
ఒకేసారి బరువు పెరగడం
ఆకలి కోల్పోవడం
చురుకుతనం తగ్గిపోవడం
హార్ట్ ఫెయిల్యూర్ ని ఎలా మేనేజ్ చేయాలంటే
హార్ట్ ఫెయిల్యూర్ ని మేనేజ్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి జీవనశైలిలో మార్పులు తేవడమే. పొగతాగడం, ఆల్కహాల్ సేవనం మానేయాలి. ఊబకాయం మొదలగు సమస్యలను తగ్గించుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యల నుండి బయటపడవచ్చు.
వైద్యం
ఈ హార్ట్ ఫెయిల్యూర్ ని తొందరగా గుర్తిస్తే గనక వైద్యంతో నయం చేయవచ్చు. అడ్వాన్స్ స్టేజిలో ఉన్నప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.