కేజ్రీవాల్ బెయిల్ న్యాయానికి ప్రతీక: సీఎం స్టాలిన్

-

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. దీన్ని అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదలతో ఇండియా కూటమి పుంజుకొని ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌ కి కొన్ని షరతులు విధించింది.

 

* రూ.50,000 పూచీకత్తు చెల్లించాలి.

* ఢిల్లీ CM ఆఫీస్, సెక్రటేరియటకు వెళ్లకూడదు.

* ప్రస్తుత కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు.

* ఈ కేసుకు సంబంధించి సాక్షులతో మాట్లాడకూడదు.

* గవర్నర్ క్లియరెన్స్ కోసం తప్ప అధికారిక ఫైళ్లపై సంతకం చేయరాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version