కేరళలో షాకింగ్ ఘటన.. యూట్యూబ్ లో చూసి డెలివరీ చేసుకున్న 17 ఏళ్ల బాలిక..!

17 ఏళ్లకే ఓ అమ్మాయి ప్రేమలో పడింది. ఇరవై ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడటం తో పాటు గర్భవతి అయ్యింది. చివరికి యూట్యూబ్ లో వీడియో చూస్తూ తన డెలివరీ తానే చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం పట్టణానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని పై అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో యువతికి పద్దెనిమిదేళ్లు రాగానే వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇంతలోనే ఆ బాలిక గర్భవతి అయింది. తన తల్లికి కళ్లు కనిపించకపోవడం… తండ్రి నైట్ వాచ్మెన్ అవడంతో తను గర్భవతి అన్న విషయాన్ని ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసింది.newborn baby cry

ఈ నెల 22న పురిటి నొప్పులు రావడంతో యూట్యూబ్ లో చూసి తన డెలివరీ తానే చేసుకుంది. ఇంట్లో పసి బిడ్డ ఏడుపు వినిపించడంతో తల్లికి అనుమానం రావడం… స్థానికులు వచ్చి చూడటంతో అసలు విషయం బయటపడింది. దాంతో బాలికను, బిడ్డను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వైద్యులు బాలిక యూట్యూబ్ లో చూస్తూ బొడ్డు పేగు కత్తిరించుకుందని చెప్పారు. అంతేకాకుండా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దాంతో ఈ అసలు విషయం బయటపడింది. మైనర్ ను గర్భవతిని చేయడంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.