జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 8 మంది మరణం.

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. దోడా జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. థాత్రి నుంచి దోడా వెళ్తున్న మిని బస్సు ప్రమాదానికి గురైంది. చినాబ్ నది వెంబడి ఉన్న సుయి గార్వి వద్ద లోయలో పడి బస్సు తునాతునకలయింది.

 ప్రమాదానికి గురైన విషయం తెలిసి రక్షణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న దోడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో  బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలను ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.