టాక్సీ ప్రయాణం.. ఇక పడవల్లో కూడా.. ప్రారంభించనున్న కేరళ.

-

టాక్సీ అనగానే రోడ్డు మీద నడిచే కారే అనుకుంటాం. కానీ సరికొత్తగా కేరళ ప్రభుత్వం నీటి మీద నడిచే టాక్సీలని తీసుకొస్తుంది. పడవల్లో ప్రయాణం చేసే వారికోసం పడవ టాక్సీలని ప్రవేశ పెడుతుంది. ఈ మేరకు కేరళ రాష్ట్ర నీటి రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. కేరళలోని అలపూజ జిల్లాలో అక్టోబర్ నుండి ఈ పడవ టాక్సీలు ప్రారంభం కానున్నాయి. పది మంది కూర్చోవడానికి వీలుగా ఉండే పడవలని ఇందులో వాడనుందట. ముందుగా నాలుగు పడవలని టాక్సీలుగా మార్చనున్నారట.

ఈ టాక్సీలని ఉపయోగించుకుని ప్రజలు తమ గమ్యాలని చేరుకోవచ్చు. ధరలు అందరికీ అందుబాటులోనే ఉండనున్నాయట. ఇలా బోట్ టాక్సీలని ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ బోట్ టాక్సీలని మనం ముందుగా బుక్ చేసుకోవచ్చు. మరి కేరళ ప్రవేశపెడుతున్న సరికొత్త టాక్సీలు ప్రజల్ని ఎలా ఆకర్షిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news