నాని మా శత్రువు కాదు.. మా సొంత అన్న – కేశినేని చిన్ని

-

కేశినేని నాని మా శత్రువు కాదు.. మా సొంత అన్న అని వ్యాఖ్యానించారు కేశినేని చిన్ని. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమని.. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండని ఫైర్ అయ్యారు. హైదరాబాదులో పోలీసులు ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారు… నేను ఓ చిన్న కార్యకర్తను.. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

ఆటోనగరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను.. కానీ దాన్ని వివాదాల్లోకి లాగారు… నేను ఓ చిన్న కార్యకర్తను.,, నేను ఎంపీగా పోటీ చేస్తానని నేను టిక్కెట్ అడగలేదని వెల్లడించారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్దం.. నేను ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదిగా..? అని మండి పడ్డారు.

రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నన్నా..? ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది..? ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ పోలీసులు నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు… నాపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదు… నాపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.. కానీ ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదు… పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news