షావోమీ నుంచి కొత్త ఫోన్..కెమెరా క్వాలిటీ నెక్ట్స్‌ లెవల్‌..!

-

మోటోరోలో నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌కు రెడీ అయింది. ఈ మధ్య మొటోరోలో వరుసగా తన బడ్జెట్‌ ఫోన్లను విడుదల చేస్తోంది. Xiaomi 200MP Camera Phoneను లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. అయితే అధికారికంగా ఇంకా లాంచ్‌ డేట్‌ను ప్రకటించలేదు. నిజానికి ఫోన్‌ పేరును కూడా కంపెనీ ఇంకా చెప్పలేదు. అయితే కెమెరాకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పుడు షావోమీ కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ1 లేదా ఐసోసెల్ హెచ్‌పీ 3 అయ్యే అవకాశం ఉంది. ఈ రెండిట్లోనూ 200 మెగాపిక్సెల్ రిజల్యూషన్ ఉండనుంది. రెడ్‌మీ కే50ఎస్ ప్రో లేదా షావోమీ 12టీ ప్రో ఫోన్లలో ఈ సెన్సార్‌ను కంపెనీ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శాంసంగ్ 50 మెగాపిక్సెల్ ఐసోసెల్ జీఎన్5 సెన్సార్, 200 మెగాపిక్సెల్ సెన్సార్‌లను రూపొందించనున్నట్లు గత సంవత్సరమే ప్రకటించింది.
Xiaomi 200MP Camera Phone స్పెసిఫికేషన్లు..
ఈ సెన్సార్‌లో 0.64 మైక్రాన్ పిక్సెల్స్‌ను అందించనున్నారు.
కెమెలియన్ సెల్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది.
టూ బై టూ, ఫోర్ బై ఫోర్ లేదా ఫుల్ పిక్సెల్ లేఅవుట్‌ను ఇది ఉపయోగించుకోనుంది.
దీని ద్వారా వినియోగదారులు 12.5 నుంచి 200 మెగాపిక్సెల్ రిజల్యూషన్స్ మధ్యలో ఫొటోలు తీసుకోవచ్చు.
200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మొదట ఫోన్ లాంచ్ చేసే కంపెనీ మాత్రం మోటొరోలానే కానుంది.
రానున్న ఒకటి, రెండు నెలల్లోనే మోటొరోలా 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్న ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేసే అవకాశం ఉంది.
కెమెరా క్వాలిటీకి, మెగాపిక్సెల్‌కు పెద్దగా సంబంధం ఉండదు.
ఎందుకంటే ఐఫోన్లలో అందించేది కేవలం 12 మెగాపిక్సెల్ సెన్సార్‌నే.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news