బిజెపి ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

-

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బిజెపి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి.. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అమ్మకాల కోసం సిగ్గు లేకుండా ఓ మినిస్ట్రీ నే పెట్టారని విమర్శించారు. ఆ మినిస్ట్రీకి దీపం అనే పేరు పెట్టి నిరుద్యోగుల జీవితాలలో చీకటి నింపుతున్నారని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత.

మరోవైపు దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని అన్నారు. వరసత్వ ఉద్యోగాలు అడ్డుకున్న వారు ఎవరో కార్మిక లోకం ప్రజలకు తెలపాలన్నారు. తెలంగాణలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న సింగరేణి కార్మికులను సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news