ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎస్పీ బెటాలియన్లలో కీలక మార్పులు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ. ఏపీ ఎస్పీ బెటాలియన్లలో మంగళగిరి అలాగే కర్నూలు కేంద్రంగా డిఐజీలు ఉంటారని… ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ. మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.
మంగళగిరి విఐజి పరిధిలోకి ఎచ్చెర్ల కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను డి ఐ జి 2 పరిధిలోకి తీసుకురావాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్ల ను..SAR సి పి ఎల్ పరిధిలోకి చేర్చింది.