తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక నిర్ణయం

-

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి బహుళ సమాధానాలు ఉన్న ఏడు ప్రశ్నలకు మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈనెల 30వ తేదీ నుంచి వెబ్సైట్ లో ఉంచనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.

అయితే కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే బోర్డు మాత్రం తాము నిరుద్ధరించుకున్న జవాబుల ప్రకారమే మార్కులు వేసి ఫలితాలను వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్లను పరిశీలించిన కోర్టు బహుళ జవాబులు ఉన్న ప్రశ్నలకు వదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news