xపోలవరం ప్రాజెక్టుపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల శక్తి శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ సమావేశంలో పాల్గోనే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశం కోసం ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాగ పోలవరం ప్రాజెక్టుపై పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తుంది.
కాగ ఈ నెల 4 వ తేదీని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. కాగ ఈ పర్యటనలో కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పెండింగ్ సమస్య కోసం సమావేశం గురించి అక్కడే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
కాగ ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాలంటే.. నిధుల సమస్య పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కాగ అంచనాల కమిటీ సిఫార్సు మేరకు రూ. 47,725 కోట్ల వరకు కేంద్ర జల శక్తి నుంచి గానీ, కేంద్ర ఆర్థిక శక్తి నుంచి గాని ఇవ్వాలి. అంతే కాకుండా ప్రతి 15 రోజులకు ఒక సారి బిల్లుల చెల్లింపులు జరగాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.