కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కరీంనగర్ గడ్డ కు తరలి రానున్నారు. నగరం నడి మధ్యలో టిటిడి గుడి కోసం సీఎం కేసీఆర్ పది ఎకరాల భూమిని కేటాయించారు. నిన్న దీనికి సంబంధించిన అనుమతి పత్రాన్ని కూడా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టిటిడి హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జి భాస్కర్ రావు గారితో కలిసి అందుకున్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ… యాదాద్రి అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్… తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కరీంనగర్ పట్టణం మధ్యలో 10 ఎకరాలు కేటాయించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుడిని గుడిని సీఎం గారి సంకల్పంతో ఏడాదిన్నర లోపే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటన చేశారు. తిరుమల కి ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతి ఫలించేలా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని చేపడతామన్నారు.