వేములవాడ హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ పై ఏసీబీ దాడుల్లో కీలక విషయాలు

-

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ పై ఏసీబీ దాడుల్లో కీలక నిజాలు వెలుగు చూశాయి. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానని హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ లంచం తీసుకున్న సంఘటనలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారులకు సంబంధం ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వేములవాడలోని ఆయన అద్దె నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 41 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో 9mm-1, 303-40 గా ధ్రువీకరించి చంద్ర ప్రకాష్ పై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు వేములవాడ పట్టణ పోలీసులు. 4.50 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 1985 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు చంద్రప్రకాష్. విధుల్లో చేరిన నాటి నుండే వివాదాస్పతుడిగా పోలీస్ శాఖలో పేరుగాంచాడు చంద్రప్రకాష్. గతంలో ఒకసారి ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. మరో మూడు సార్లు సస్పెండ్ కూడా అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news