BREAKING : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

-

మునావర్ ఫారూఖీ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మునావర్ ఫారూఖీ షో ను అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా రాజా సింగ్ ను హౌజ్ అరెస్ట్ చేశారు గోషామహల్‌ పోలీసులు. ఇక ఈ సందర్భంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ.. స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటాం..ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారన్నారు.

షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తాము.. శాంతి భద్రతల సమస్య తలెత్తితే..డీజీపీ , ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా..నేను షో ను అడ్డుకుని తీరుతానని స్పష్టం చేశారు. ధర్మం కన్నా..నాకు పార్టీ ముఖ్యం కాదు..హిందూ దేవుళ్ళ ను కించపరిచే వారి కామెడీ షో లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని వెల్లడించారు. మునావర్ ఫారూకీ షో జరిగితే..మరుసటి రోజు నా సమాధానం కూడా గట్టిగానే వుంటది… నా వల్ల ఇప్పటి వరకు శాంతి భద్రతల సమస్య ఎక్కడా రాలేదని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news