విద్యుత్‌ కోతలు, వినియోగంపై మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కీలక ప్రకటన

-

విద్యుత్‌ కోతలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రశ్నోత్తరాల సెషన్‌ షురూ అయింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి వర్యులు జ‌గ‌దీష్ రెడ్డి… మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ లో విద్యుత్‌ కోతలే లేవని… ఎండాకాలం వచ్చినా.. మెరుగైన విద్యుత్‌ అందిస్తామని వెల్లడించారు.

తెలంగాన ఏర్ప‌డిన 6 నెల‌లలో విద్యుత్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామని.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి , వినియోగం పెరిగిందని స్పష్టం చేశారు. 26 ల‌క్ష‌ల 36 వేల వ్య‌వ‌సాయ క‌నెక్ష‌న్ లు ఉన్నాయని.. 35 వేల కోట్ల తో విద్యుత్ రంగ సంస్త‌ల‌కు చుయూత‌నిచ్చామని ఆయన ప్రకటన చేశారు. విద్యుత్ న‌ష్టాల‌లో జాతియ స‌గ‌టు కంటె తెలంగాన స‌గ‌టు త‌క్కువ అని… విద్యుత్ తీగ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఇళ్ళ నిర్మాణం చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు ఉంటాయని ఆయన చెప్పారు. విద్యుత్‌ కోతలపై ఎవరూ ఆందోళన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news