ఇంట‌ర్ ఫ‌లితాలు, ఆన్లైన్ తరగతులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

-

ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫ‌లితాలపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మరో వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రానున్నాయని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఏ విధంగా రిజల్ట్స్ ప్రకటించాలనే క్రైటీరియా రెడీ చేసి ప్రభుత్వంకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. జులై ఒకటి నుండి సెకండ్ ఇయర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయని.. జులై 15 నుండి మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ సారి బ్లెండెడ్ మోడ్ లో ఇంటర్ తరగతులు (ఆఫ్ లైన్, ఆన్లైన్) ఉంటాయని.. ఈ సారి కూడా 70 శాతం సిలబస్ ఉంటుందన్నారు.

లెక్చరర్ లు ,సిబ్బంది వంద శాతం కళాశాలలకి హాజరు కావాల్సిందేనని.. ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువు పొడగించామని వెల్లడించారు. ఆఫలియేషన్ ఫీజ్ ను తగ్గించామని.. గతంలో ఉన్న ఫీజులు కళాశాలలు చెల్లిస్తే సరిపోతుందన్నారు… ఆన్లైన్ తరగతులపై t-sat, దూరదర్శన్ తో ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news