KGF: కేజీఎఫ్-3 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత… రిలీజ్ ఎప్పుడంటే..!

-

కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. బాలీవుడ్ పరిశ్రమకే చెమటలు పట్టిస్తోంది. అంతా ఈ సినిమా నార్త్, సౌత్ అని తేడా లేకుండా విజయవిహారం చేస్తోంది. అయితే కేజీఎఫ్ లవర్స్ కు మరో గుడ్ న్యూస్. కేజీఎఫ్ 3 ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ నీల్ హింట్ ఇవ్వగా… తాజాగా నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 ఉంటుందని ధ్రువీకరించాడు. 

‘కెజిఎఫ్‌3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ కల్లా ఇది పూర్తవుతుందని, ఆ తర్వాత ‘కెజిఎఫ్3’పై దృష్టిసారిస్తారట. అంతే కాదు ప్రశాంత్ నీల్ ఇటీవల ఎన్టీఆర్ 31 కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోటోషూట్ కూడా చేసాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ ‘కేజీఎఫ్ 3’ ని ఆరంభిస్తే ఎన్టీఆర్ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news