కేజిఎఫ్ 2 సంజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్, ఇలా ఉన్నాడేంటిరా బాబూ…!

-

ఇండియన్ సినిమాలో సంచలనం అయిన కేజిఎఫ్ చిత్రం రెండో భాగంకు సంబంధించి బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ కి చిత్ర యూనిట్ పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చింది. 62వ ఏట అడుగు పెడుతున్న సంజయ్ దత్ ఈ సినిమాలో అధీరాగా నటిస్తున్నాడు. ఈ నేపధ్యంలో… అతని ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతాలో దీనిని పోస్ట్ చేసాడు.

ఈ సినిమా రెండో భాగంలో సంజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ లుక్ లో సంజయ్ కాస్త భయంకరంగానే ఉన్నాడు. ఒక చేత్తో కత్తి పట్టుకుని ముఖం మీద టాటూతో ఉన్నాడు. ఇక సంజయ్ సాల్ట్ పెప్పర్ లుక్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. సంజయ్ హెయిర్ స్టైల్ కూడా కాస్త భిన్నంగానే ఉంది. కేజీఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో విడుదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news