ఈ సారి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎత్తు ఎంతంటే..?

-

గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. గతేడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహా గణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి తగ్గింది. కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం ఈ విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది.

ఎత్తు తగ్గనున్న కారణంగా పూర్తిగా మట్టి విగ్రహాన్నే ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అలాగే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news