రూ.18వేల కోట్లతో రష్యా నుంచి కొత్త ఫైటర్‌ విమానాల కొనుగోలు..!

-

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా భారత్‌ తన మిలిటరీ సామర్థ్యాలను, ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే గతంలో ప్రధాని మోదీ ఆయా దేశాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇప్పుడు వాటి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక తాజాగా రక్షణ శాఖ కొత్త ఫైటర్‌ విమానాల కొనుగోలుతోపాటు, ఇప్పటికే ఉన్నవాటిని అప్‌గ్రేడ్‌ చేసేందుకు కావల్సిన అనుమతులు జారీ చేసింది.

india to buy fighter aircrafts from russia

భారత్‌ రష్యా నుంచి కొత్తగా 33 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనుంది. వాటిల్లో 12 ఎస్‌యూ-30ఎంకేఐలు, 21 మిగ్‌-29 విమానాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఉన్న 59 మిగ్‌-29 విమానాలను నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇందుకు గాను మొత్తం రూ.18,148 కోట్లు వ్యయం కానుంది. ఈ మేరకు కావల్సిన అనుమతులను రక్షణ శాఖ సంబంధిత అధికారులకు మంజూరు చేసింది.

దీంతో భారత్‌ ఫైటర్‌ విమానాల విషయంలో చైనా కన్నా మరింత మెరుగైన వ్యవస్థను కలిగి ఉండనుంది. ఈ మేరకు ఆయుధ సంపత్తిని సమకూర్చుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news