గోవాలో ఎంజాయ్ చేస్తూ దొరికిన కిడ్నాప్ కేసు నిందితులు !

Join Our COmmunity

బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ నిందితులు గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తించారు. విజయవాడ లో ఉన్న నిందితుల ఇళ్ల కు వెళ్ళిన పోలీసులు, అక్కడ వారంతా గోవాకు వెళ్లినట్టు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్ళిన పోలీసులు గోవాలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు తరలించనున్నారు. కిడ్నాప్ కేసులో సిద్దార్ట్ అండ్ టీంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

గోవాలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, భార్గవ్ రాం, గుంటూరు శ్రీను మిగత నిందితుల కోసం మాత్రం గాలింపు కొనసాగుతోంది. ఇవాళ అఖిల ప్రియని కిడ్నాప్ ఉద్దేశం పైనే విచారించారు పోలీసులు. సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను అఖిల ప్రియ ముందు ఉంచిన పోలీసులు ఆ మేరకు విచారించారు. అయితే దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ సమాధానం చెప్పినట్టు చెబుతున్నారు. మరికొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదంటూ దాటవేసినట్టు చెబుతున్నారు.

TOP STORIES

సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను...
manalokam telugu latest news