కాబుల్ ఎయిర్ పోర్ట్‏లో 150 మంది భారతీయుల కిడ్నాప్ !

-

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకొని…. అరాచకాలకు పాల్పడుతున్నారు తాలిబన్లు. అయితే తాజాగా కాపులు ఎయిర్ పోర్టు లో ఏకంగా 150 మంది భారతీయులను తాలిబన్లు బంధించినట్టు సమాచారం అందుతోంది. C- 17 విమానంలో భారతదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా… తాలిబన్లు వీరిని బంధించి నట్లు గా వార్తలు వస్తున్నాయి.

వీరిలో కొంతమంది పై దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా తాలిబన్లు కిడ్నాప్ చేశారు. అయితే తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఎక్కువగా మన దేశానికి చెందిన వారే ఉండటం గమనార్హం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ c 130 జె ట్రాన్స్ పోర్ట్ విమానం కాబూల్ నుంచి 80 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ అపహరణ జరిగింది. వీరంతా c 17 విమానంలో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news