కరోనా వైరస్ దెబ్బకు ఆర్ధికంగా నష్టపోవడంతో ఇప్పుడు ఆర్ధిక నష్టాల నుంచి బయటకు రావడానికి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు అని ఆ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇద్దరు వ్యక్తులను ఉరి తీయించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ విషయాన్ని పొరుగుదేశం దక్షిణ కొరియా వెల్లడించింది. సముద్రంలో చేపలు పట్టడాన్ని నిషేధించి, రాజధాని ప్యోంగ్యాంగ్‌ను లాక్ డౌన్ చేయాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు దక్షిణ కొరియా గూడాచారి సంస్థ శుక్రవారం వెల్లడించింది.
గత నెలలో ప్యోంగ్యాంగ్‌లో వ్యాపారాలు చేసే వారిని కూడా ఉరి తీయించారు. విదేశాల నుంచి తీసుకువచ్చే వస్తువులను పరిమితం చేసే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆగస్టులో ఉత్తర కొరియా ఒక కీలక అధికారిని ఉరితీసిందని దక్షిణ కొరియా చెప్పింది. ఉత్తర కొరియా సముద్రంలో చేపలు పట్టడం మరియు ఉప్పు ఉత్పత్తిని నిషేధించిందని ఆ దేశం వెల్లడించింది.