కిమ్ మృతి…? తర్వాత ఎవరు…?

-

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారా… అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అతనికి తీవ్రమైన స్మోకింగ్ అలవాటు తో పాటుగా, భారీ ఖాయం కావడంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం తో ఏప్రిల్ 15 న జరిగిన తన తాత జయంతి వేడుకలకు కూడా అతను హాజరు కాలేదు. ఇటీవల అతనికి హార్ట్ సర్జరీ చేసారు.

ఇక అక్కడి నుంచి అతను బయటకు రాలేదు. దీనితో ఇప్పుడు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను అసలు ఉన్నాడా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు ఆ దేశ అధికార మీడియా కూడా ఏ ప్రకటనా చేయలేదు. అసలు ఎవరిని తన తర్వాత పాలానా పగ్గాలు ఎవరికి ఇస్తారు అనేది అర్ధం కావడం లేదు. అయితే అతను తన సోదరిని ఇప్పటికే ఎంపిక చేసారని అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీ లో ఆమె సరిగా వ్యవహరించలేదు అని ఆమెను పక్కన పెట్టారు కిమ్. ఆమెని కేంద్ర కేబినేట్ నుంచి తొలగించారు. కాని ఇటీవల జరిగిన కేబినేట్ విస్తరణ లో మళ్ళీ ఆమెకు చోటు కల్పిస్తూ అతను నిర్ణయం తీసుకున్నారు. అలాగే అతి కొద్ది మంది మాత్రమే ఉండే సెంట్రల్ కమిటీ లో కూడా ఆమెకు ప్రత్యామ్నాయ సభ్యురాలి గా అవకాశం కల్పించారు.

దీనితో ఆమెనే ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించి మరణించి ఉండవచ్చు అని అమెరికా మీడియా అంటుంది. అతని ఆరోగ్య పరిస్థితిపై చైనా గాని దక్షిణ కొరియా గాని స్పందించడం లేదు. అతను కరోనా కంటే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని అంటున్నారు. 36 ఏళ్ళ కిమ్ కి నియంతగా పేరున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news