ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోజు రోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయం, కిడ్నీ సమస్యలతో ఆయన కొంత కాలంగా బాధపడుతున్నారు. గతంలో ఒకసారి ఆయనకు వైద్యులు ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించారు.
మషాలా వస్తువులను ఎక్కువగా తినే కిమ్ కి కొన్ని అలవాట్లు ఉన్నాయని దీనితో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అని సమాచారం. కిమ్ ఇప్పటికి పొగ తాగడం ఆపడం లేదని అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. అలాగే మద్యం కూడా ఆయన రెగ్యులర్ గా సేవించడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన్ను రాజధానిలో ఉన్న ఒక ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.
ఆ ఆస్పత్రిలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చైనా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరా తీసారని తెలుస్తుంది. అటు కుటుంబ సభ్యులు కూడా బయటకు రావడం లేదు. అయితే ఆయనకు కరోనా వచ్చిందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు ఉన్నా సరే చెప్పడం లేదని పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.