ఎప్పుడూ ఏదోక సందడి చేసే ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ మీడియా కు కనపడకపోవడానికి కారణం ఏంటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఆయన మరణించారు అనేది జపాన్ సహా పలు దేశాల మీడియా చెప్పే మాట. ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనేది చాలా మంది అభిప్రాయం. ఆయన ఆరోగ్యం విషయంలో మీరు ఏమీ కంగారు పడవద్దు దక్షిణ కొరియా చెప్తుంది.
అయితే ఆయన చనిపోలేదు అని… ఏప్రిల్ 15న ఆయన తాత జయంతి వేడుకలకు హాజరు కానిది కరోనా భయంతో అని, ఆయన అనారోగ్యం కారణంగా కాదు కరోనా కారణంగా దాక్కున్నారు అని చెప్తుంది దక్షిణ కొరియా. అసలు ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కటి కూడా లేవు అని… కాని కరోనా రాకుండా ఆ దేశంలో కఠిన చర్యలు తీసుకున్నారని అన్నారు. కిమ్ కి కరోనా భయం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
జనవరి మధ్య నుండి కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 20 రోజులు కనిపించకుండా పోయిన సందర్భాలు కనీసం రెండు ఉన్నాయని ఒక సీనియర్ దక్షిణ కొరియా మంత్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కిమ్ జోంగ్ ఉన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. అతను బాగానే ఉన్నాడు అని అతని ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని… ఆ పరిస్థితి తాను ఇప్పుడు చెప్పలేను అని అన్నారు ట్రంప్.