ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉత్తర ప్రదేశ్ లో 15 రోజుల్లో వంద మంది హత్యకు గురయ్యారని వారిని ఎవరు చంపారో తెలియదు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఆమె చేసిన ట్వీట్ లో ఈ వ్యాఖ్యలు చేసారు. ఉత్తర ప్రదేశ్‌లో గత 15 రోజుల్లో వంద మంది హత్య చేయబడ్డారని ఆమె ఆరోపించారు.
ఈ హత్యల క్రమాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా వివరించారు. మూడు రోజుల క్రితం పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను ఎటాలో అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు కనుగొన్నారని ఆమె చెప్పడం గమనార్హం. వారికి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని ప్రియాంకా వ్యాఖ్యానించారు. దీనికి ఎవరి హస్తం ఉందో కూడా తెలీదని ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేసారు.
దీనిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని ప్రియాంక డిమాండ్ ఆ ట్వీట్ లో డిమాండ్ చేసారు. ఈ హత్యలు ఇప్పుడు యుపి లో సంచలనంగా మారాయి. విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఈ హత్యలపై రాష్ట్ర ప్రభుత్వ౦ విచారణ జరిపించాలని కోరుతున్నారు. అటు ఎస్పీ, బిఎస్పీ కూడా దీనిపై స్పందించాయి. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ప్రకటన రాలేదు.