కీరా స్వీట్‌కార్న్‌ చాట్‌.. లో కాలరీస్‌ స్నాక్‌ ఐటమ్..!

-

చాట్‌ అంటే ఎప్పుడూ ఆ పానిపూరి బండి దగ్గర ఉండేదే కాదు…కాస్త వెరైటీగా లో కాలరీస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి చేసుకుంటే ఉంటే అటు ఆరోగ్యానికి మంచిది.. షుగర్‌ పేషెంట్స్‌కు ఇంకా మేలు. స్వీట్‌కార్న్‌లో తక్కువ కాలరీలు ఉంటాయి, ఇంకా కీరాలో కూడా అంతే. వీటితో చాట్‌ ఎంత తిన్నా కాలరీలు రావు, పొట్ట నిండిపోతుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా..!

కీరా స్వీట్‌కార్న్‌ చాట్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

కీరాదోసకాయ ఒకటి
స్వీట్‌కార్న్‌ గింజలు అరకప్పు
టమోటా ముక్కలు పావుకప్పు
క్యారెట్‌ ముక్కలు పావుకప్పు
కొబ్బరి తురము రెండు టేబుల్‌ స్పూన్
ఓట్స్‌ రెండు టేబుల్‌ స్పూవ్
లెమన్‌ జ్యూస్ ఒక టేబుల్‌ స్పూన్
టమోటా సాస్‌ ఒక టేబుల్‌ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
మిరియాల పొడి ఒక టీ స్పూన్
జిలకర్ర ఒక టీ స్పూన్
చాట్‌ మసాల కొద్దిగా
పుదీనా కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

కీరాదోసకాయను చివరిభాగాలు కట్‌ చేసి నిలువగా రెండు ముక్కలు చేయండి. చిన్న స్పూన్‌ సాయంతో కీరాదోసకాయ లోపల ఉండే గుజ్జును అంతా తీసేయండి. పొయ్యిమీద నాన్‌స్టిక్‌ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి జీలకర్ర, స్వీట్‌కార్న్‌ గింజలు, వేసి మెల్లగా వేగనివ్వండి. దాంతోపాటు క్యారెట్‌ ముక్కలకు, ఓట్స్‌ ఐదు నిమిషాలు మూతపెట్టి ఉంచండి. తర్వాత అందులో టమోటా ముక్కలు వేయండి. కొబ్బరి తురుము వేయండి. బాగా కలిపేసి ఒక బోల్‌లో వేయండి. పైన పుదీనా, కొత్తిమీర, జీలకర్రపొడి, మిరియాల పొడి, చాట్‌మసాల పొడి, నిమ్మరసం పైన కీరాదోసకాయ కండ కూడావేసేసి బాగా మిక్స్ చేయండి. ఇలా కూడా తినొచ్చు. చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా అందంగా సర్వ్‌ చేయాలంటే.. ముందు మనం గుజ్జుతీసేసిన కీరా ఉంది కదా.. అందులో టమోటా సాస్‌ వేసి పైన ఈ చాట్‌ వేయండి. చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తూ తినేస్తారు. దీన్ని చేయడానికి కూడా పెద్దగా టెమ్‌ పట్టదు కాబట్టి ఓసారి మీరూ ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version