BREAKING : ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్నయం తీసుకున్నారు. అతి త్వరలోనే బీజేపీలోకి వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. గత కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలోనే.. ఏపీ బీజేపీలో ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడంతో కిరణ్ ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది బీజేపీ. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే… ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం అందుతోంది.