నేను కమిటెడ్.. నెటిజన్ ప్రశ్నకు కీర్తి సురేష్ సమాధానం.!

మహానటి సినిమాతో ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది కీర్తి సురేష్ మహానటి తర్వాత ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ అమ్మడు మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ సర్కార్ వారి పాటలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించి ఈ ముద్దుగుమ్మ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు కమిటెడా లేక సింగిలా అని అడిగిన ప్రశ్నకు ఎంతో తెలివిగా ఆసక్తికర సమాధానం చెప్పింది. నా వృత్తి పట్ల నేను ఎప్పుడూ కమిటెడ్ అంటూ కీర్తి సురేష్ సమాధానమిచ్చింది.